1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

లారెన్స్ హీరోగా ''పార్థు'' ఆడియో విడుదల

లారెన్స్ హీరో పార్థు ఆడియో విడుదల
WD PhotoWD
లారెన్స్ హీరోగా రూపొందిన పార్థు చిత్రం ఆడియో తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వంవహించడం విశేషం. ఈ చిత్రంలో స్నేహ హీరోయిన్‌గా నటిస్తోంది. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మన్యం రమేష్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలోను రూపుదిద్దుకుంటోంది.

శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో ఆడియో క్యాసెట్‌ను వి.వి.వినాయక్ ఆవిష్కరించగా, ఆడియో సీడీని అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలోని పాటలను వినిపించి అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల అభిప్రాయాలను చెప్పమని నిర్వాహకులు కోరారు.

ఈ సందర్భంగా వినాయక్ స్పందిస్తూ తాను పాటలను జడ్జి చేయలేనని అయితే తాను మాస్ దర్శకుడినైనా తనకు మెలోడీ అంటే ఇష్టమని అన్నారు. ఈ చిత్రంలోని పాటలకు లారెన్స్ బాగా డాన్స్ చేశాడని చెప్పగలను అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇందులో సెక్సీ... సెక్సీ... అనే పాట చాలా బాగుందని అన్నారు.

ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అని చిత్రం కూడా సూపర్‌హిట్ కావాలని ఆకాంక్షించారు. చిత్ర హీరో లారెన్స్ మాట్లాడుతూ ఈ చిత్రం మథర్ సెంటిమెంట్‌తో రూపొందించబడింది. తల్లి చనిపోయినపుడు వచ్చే ఓ పాట చిత్రీకరణ చూచి యూనిట్ మొత్తం చలించిపోయిందని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ఇంతకుముందు లారెన్స్ తనచేత ముని చిత్రాన్ని పబ్లిసిటీ చేయించారని ఆ చిత్రం బాగా ఆడిందని అన్నారు. ఈ చిత్రం కథ నచ్చడంతో తాను నిర్మాతగా మారానని అన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుందని ఆయన తెలిపారు.