1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఇకపై సినిమాలకే ప్రాధాన్యం: శివారెడ్డి

ఇక సినిమాల ప్రాధాన్యం శివారెడ్డి
WD PhotoWD
ఇకనుంచి సినిమాలకే తొలిప్రాధాన్యం ఇవ్వనున్నట్టు హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి పేర్కొన్నారు. మిమిక్రీ ప్రదర్శనలకోసం ఎప్పుడూ ఇతరదేశాలకు పయనమయ్యే తాను ఇకపై సినిమాలపైనే దృష్టి పెడుతానని ఆయన అన్నారు.

శనివారం శివారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల మధ్య ఆయన ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఇకపై తన సంపాదనలో 25 శాతాన్ని ఇతరుల కోసం ఖర్చు చేస్తానని అన్నారు.

మిమిక్రీ ప్రదర్శనల కోసం ఇతరదేశాల్లో పర్యటించే తాను ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో మిమిక్రీ మాస్ట్రో అవార్డును, బోస్టన్‌లో వినోదరత్న బిరుదులు పొందానని శివారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మిమిక్రీకే పరిమితమై పోకుండా ఇకనుంచి సినిమాలపై కూడా శ్రద్ధ వహిస్తానని ఆయన అన్నారు.

ప్రస్తుతం తాను సోంబేరి, రెయిన్‌బో చిత్రాల్లో నటించానని ఆయన తెలిపారు. నటుడు అలీని తాను దేవునిగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. మొదటి నాలుగు చిత్రాలు ఆయన కాంబినేషన్‌లో చేయడం తన అదృష్టమని శివారెడ్డి అన్నారు.

తాను ఇప్పటివరకు 2000కు పైగా ప్రదర్శనలిచ్చానని అందులో చిరంజీవి చేతుల మీదుగా ఫన్ అవార్డు పొందడం తన తీయని జ్ఞాపకమని శివారెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ సంబరం వేళ హీరోలు మరో హీరోల్లా ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందన్న కాన్పెప్ట్‌తో తాను చేసిన కార్యక్రమం తన కెరీర్‌లో హైలెట్ అని శివారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ నటులు శివారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.