శివాజీ, కృష్ణభగవాన్‌ల ''కుబేరులు'' టాకీ పూర్తి
శివాజీ, కృష్ణభగవాన్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న కుబేరులు చిత్రం ఇటీవలే టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను హైదరాబాద్ సమీపాన గల అల్యూమినియం ప్యాక్టరీలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ నా గత చిత్రాల వలే ఈ చిత్రం కూడా ఉంటుందని అన్నారు.
తమను కుబేరులుగా ఊహించుకునే ముగ్గురి వ్యక్తుల కథే ఈ చిత్రం అని ఆయన అన్నారు. వాళ్లకి అన్నీ అప్పులే అనేది ఈ చిత్రం క్యాప్షన్ అని ఆయన తెలిపారు. ఈ నెలాఖరున మలేషియాలో పాటలను చిత్రీకరించనున్నామని ఆయన చెప్పారు.
శివాజీ మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డితో తాను మూడో చిత్రం చేస్తున్నానని అన్నారు. ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయన్నారు. హిట్ చిత్రానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ చిత్రానికి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో డాన్‌గా నటిస్తున్నానని అన్నారు. ఇలాంటి పాత్ర తాను గతంలో చేయలేదని ఆయన తెలిపారు.