1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వెయ్యి ప్రింట్లతో విడుదలకు సిద్ధమవుతున్న దశావతారం

వెయ్యి ప్రింట్ల విడుదల సిద్ధమవుతున్న దశావతారం
కమల్‌హసన్ పది విభిన్న పాత్రలతో నటిస్తున్న దశావతారం అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 1000 ప్రింట్లతో దేశం యావత్తు విడుదల చేయడానికి ఈ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సన్నాహాలు చేస్తున్నారు.

జూన్ మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలు ఉన్నట్టు చిత్ర నిర్మాత చెబుతున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీలతో పాటు భోజ్‌పురి భాషలోను విడుదల చేయనున్నారు.

అలాగే ఈ చిత్రాన్ని చైనీస్, జపనీస్ భాషల్లోనూ డబ్ చేయడానికి నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కమల్ స్వయంగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

ఈ చిత్రంలో అశిన్, జయప్రద, మల్లికాషెరావత్ లాంటి అగ్రతారాగణం నటిస్తున్నారు. ఇటీవలే చెన్నైలో జరిగిన కార్యక్రమంలో హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీఛాన్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో విడుదలైన విషయం తెలిసిందే.