1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తెలుగులో ''న్యాయంకావాలి''గా ''మిస్ అనారా''

తెలుగు న్యాయంకావాలి' మిస్ అనారా
WD PhotoWD
మిస్ కాశ్మీర్ అనారాగుప్తా జీవితంలో జరిగిన చేదు అనుభవాలను తెరకెక్కిస్తూ హిందీలో వచ్చిన మిస్ అనారా చిత్రం తెలుగులో వస్తోంది. న్యాయంకావాలి అన్న పేరుతో విడుదలకానున్న ఈ చిత్రం విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై సోమ విజయప్రకాష్ నిర్మాతగా తెలుగులో విడుదలవుతోంది.

ఈ చిత్రానికి దీపక్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ మిస్ అనారా ఎదుర్కొన్న అనుభవాలు, పోలీసుల వల్ల ఆమె అనుభవించిన కష్టాలు ఈ చిత్రంలో ఉంటాయని అన్నారు. అందుకే ఈ చిత్రానికి న్యాయంకావాలి అనే పేరు పెట్టామని ఆయన తెలిపారు.

ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో పోలీస్ అధికారిణిగా తెలంగాణా శకుంతల పాత్ర హైలెట్‌గా నిలుస్తుందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మయూరి, అశ్విని చిత్రాల తరహాలో తనపై తీసిన చిత్రంలో అనారాగుప్తానే స్వయంగా నటించడం విశేషం అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో రోమిత్, కృష్ణభగవాన్, రాళ్లపల్లి, హేమసుందర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం- డి.వి.రావు, పాటలు- తుంబలి శివాజీ, కెమెరా- అమర్, ఎడిటింగ్- నందమూరిహరి.