నితిన్, ప్రియమణి జంటగా ప్రారంభమైన ''ద్రోణ''
|
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా నితిన్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ హైదరాబాద్‌లో షూటింగ్ సందర్భంగా ఓ పాటను, ఫైట్‌ను చిత్రీకరించామని తెలిపారు. లవ్, యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు.