1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సెక్స్‌ అప్పీల్ పోటీతో...సాధించేది ఏమీ లేదు

సెక్స్‌ అప్పీల్ పోటీ లేదు
సెక్స్ అప్పీల్ ఒక్కొక్కరికీ ఒక్కో రీతిలో ఉంటుంది... దానిని ప్రదర్శించేందుకు ప్రేక్షకులను రెచ్చగొట్టే స్థాయిలో పోటీపడటం అవివేకమే. ఈ మాటలు అంటోంది ఎవరో తెలుసా. మీ స్వీట్ హార్ట్ స్నేహ.

ఇంకా ఏ మంటోందంటే... నటనా సామర్థ్యం కంటే సెక్సీగా నటించడాన్నే చాలా మంది హీరోయిన్లు నమ్ముకుంటున్నారు. సెక్సీగా నటిస్తేనే అగ్రస్థానానికి చేరుకోగలమనే వారు భావిస్తుండటం ద్వారా ఈ విషయంలో పోటీ నెలకొంటోంది.

సెక్సీ తారలు ఎక్కువ కాలం ఫీల్డ్‌లో నిలబడలేరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. తక్కువ రోజుల్లోనే వారు నిష్క్రమించాల్సి ఉంటుంది. కుటుంబ రీతి వేషధారణతోనే ఎక్కువ కాలం ఈ రంగంలో నిలబడగలరు.

మొదట్నుంచీ నేను ఈ తరహా పాత్రలకే ప్రాధాన్యమిస్తున్నందునే ఇంతకాలం ఫీల్డ్‌లో నిలబడగలుగుతున్నాను. ఇది తెలుసుకుని మసలుకుంటే అందరికీ మంచిది.