1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వెంకటేష్‌తో క్రిష్ ''కృష్ణా ముకుందా మురారి''

వెంకటేష్‌ క్రిష్ కృష్ణా ముకుందా మురారి
WD PhotoWD
గమ్యం చిత్రం ద్వారా నూతన దర్శకుడు రాధాకృష్ణ(క్రిష్) తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. గమ్యం చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కించిన తీరు అద్భుతమని పలువురు ప్రశంసించారు. ఇలా తొలిచిత్రంతోనే సృజనాత్మకత ఉన్న దర్శకునిగా పేరుతెచ్చుకున్న రాధాకృష్ణ త్వరలో వెంకటేష్‌ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్టు ప్రకటించారు.

అలా రాధాకృష్ణ తయారు చేసిన కథ వెంకటేష్‌కు నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో రాధాకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న ఆ చిత్రానికి కృష్ణా ముకుందా మూరారి అనే టైటిల్ పెట్టడానికి కూడా రాధాకృష్ణ సిద్ధమయ్యారు.

అయితే ప్రస్తుతం యోగి దర్శకత్వంలో నల్లమలపు బుజ్జి నిర్మాతగా నిర్మిస్తున్న చింతకాయల రవి చిత్రంలో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పూర్తికాగానే కృష్ణా ముకుందా మురారి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.