హాలీవుడ్‌లోనూ అదరగొడుతోన్న ఐశ్వర్య
|
మాజీ ప్రపంచ సుందరిగా చిత్రరంగంలోకి ప్రవేశించిన ఐశ్వర్య కేవలం భారతీయ చిత్రాల్లోనే కాక హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. అబిషేక్‌బచ్చన్‌తో పెళ్లికి ముందు బ్రైడ్ అండ్ ప్రెజుడీస్, ది లాస్ట్ లీజియన్, అనే ఆంగ్ల చిత్రంలో నటించిన ఐశ్వర్య హాలీవుడ్ అభిమానులను సైతం ఆకట్టుకుంది.
దీంతో హాలీవుడ్‌లో సైతం ఐశ్వర్యకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హాలీవుడ్‌లో నిర్మితమవుతోన్న ది పింక్ పాంధర్ చిత్రంలో ఐశ్వర్య నటిస్తోంది. దీని తర్వాత భారత్ వేదికగా షూటింగ్ జరుపుకోనున్న సింగులారిటీ అనే హాలీవుడ్ చిత్రంలోనూ ఐశ్వర్య నటించనుంది.
ఇవన్నీ కాకుండా హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ కొలిన్ సిర్రీ దర్శకత్వం వహించనున్న మరో చిత్రంలోను ఐశ్వర్య ఇటీవలే ఎంపికైంది. ఈ చిత్రంలో ఐశ్వర్య ఓ వేశ్యపాత్రలో నటించనుండడం విశేషం. వీటితోపాటు డైరెక్టర్ శంకర్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రోబో చిత్రంలోను ఐశ్వర్య నటించనున్న విషయం తెలిసిందే.