రాజా, కామ్నలు ఆడే ''అందమైన అబద్ధం''
|
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తానీ చిత్రం చేస్తున్నానని చెప్పారు. తల్లితండ్రులు, బిడ్డల మధ్య సంబంధం ఎలా ఉండాలి అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నామని ఆయన అన్నారు. చక్కని కుటుంబకథ, విలువలు గల చిత్రంగా దీన్ని తెరరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ చిత్రంలో తారాగణం ఎక్కువగా ఉన్నా అన్ని పాత్రలు ఆకట్టుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను, కొంత టాకీని హాంకాంగ్‌లో చిత్రీకరించామని ఆయన తెలిపారు. ఈనెల 31తో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన వివరించారు.
ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోన్న నాగబాబు మాట్లాడుతూ ఐదేళ్లనాడు రవిరాజా దర్శకత్వంలో రుక్మిణి చిత్రంలో తాను నటించానని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా తాను నటిస్తున్నానని ఆయన తెలిపారు. ఎం.ఎస్. నారాయణ మాట్లాడుతూ రుక్మిణి చిత్రంతో రవిరాజా తన జీవితాన్ని మార్చేశారని అందుకు ఆయనకు ధన్యవాధాలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ చిత్రంలో అల్లురామలింగయ్య తరహా పాత్రలో తాను నటిస్తున్నానని అన్నారు. నరేష్ మాట్లాడుతూ రవిరాజా దర్శకత్వంలో చేయలేదనే వెలితి ఈ చిత్రం ద్వారా తనకు తీరిందని అన్నారు. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నానని తెలిపారు.
హీరోయిన్ కామ్న జెఠ్మలాని మాట్లాడుతూ టాస్ తర్వాత రాజాతో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఈ చిత్రంలో నటించడం చాలా థ్రిల్‌గా ఉందని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నిళల్‌గల్‌రవి, రేఖ, సుధ, సురేఖావాణి, శివాజీరాజా, రాధాకుమారి, సుపీద, శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా- రామ్‌పినిశెట్టి, పాటలు- భాస్కరభట్ల, మాటలు- రమేష్‌గోపి, రచనా సహాకారం- జె.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- రవిరాజా వినిశెట్టి.