1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిర్రుబుర్రులాడిన ''బాపు బొమ్మ''

యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న నటి ఛార్మి. తన అందాలతో
FileFILE
యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న నటి ఛార్మి. తన అందాలతో మైమరిపించే ఛార్మీ '16 డేస్' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. తన గురించి రకరకాలుగా రాస్తున్న వార్తలపై ఒక్కసారి ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఇటువంటి కథలు ఎవరు చెపుతున్నారంటూ ప్రశ్నిస్తూ.. నన్నడిగితే నేనే ఇంకా ఎక్కువగా చెబుతాను కదూ అంటూ ఆగ్రహించారు.

వివారాల్లోకి వెళితే.. ఆమె ఫోటోల కోసం సినిమా ప్రారంభం నుంచి ఫోటోగ్రాఫర్లు వివరీతంగా ప్రయత్నిస్తున్నా ఆమెకు అవకాశం చిక్కలేదట. చివరికి షూటింగ్ ముంగింపు దశలో పాల్గొన్న ఆమెను ఫోజు ఇవ్వమంటే.. ఎన్ని ఫోటోలు తీస్తారంటూ అసహనం ప్రదర్శించింది.

దీంతో వారు మీరసలు ఫోటోలు ఇవ్వరంటగదా? అందుకే మేము తీస్తున్నామని చెప్పారు. దీంతో ఒక్కసారి తీవ్ర స్వరంతో చెత్తకథలు ఎవరు చెప్పారు. ఫోటోలు ఇవ్వలేదని మీకు చెప్పానా? అయినా? నా గురించి అన్నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. దానికి నేనేం చేయను. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండంటూ చిర్రుబుర్రులాడింది.
About Writer
PNR