1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

షెడ్యూల్ పూర్తయిన శ్రీహరి-ఆర్యల చిత్రం

ఆర్యన్ రాజేష్
FileFILE
ఆర్యన్ రాజేష్, శ్రీహరి కాంబినేషన్‌లో లివింగ్ లెజండ్స్ క్రియేషన్స్‌ పతాకంపై రామకృష్ణ దర్శకత్వంలో ఎల్.ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. గణేష్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో 40 మంది ఫైటర్స్‌తో ఆర్యన్‌పై ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆగస్త్యన్ సంగీత సారథ్యంలో మూడు పాటల రికార్డింగ్ పూర్తయింది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఒక మిస్డ్ కాల్‌ వల్ల ఏం జరిగిందనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెండో షెడ్యూల్ ఫిలిం సిటీలో ఈనెలలో ప్రారంభిస్తాం. ఆర్యన్‌తో కొత్త తరహాలో కన్పిస్తాడు. ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, చరణ్ రాజ్, కోటశ్రీనివాసరావు, ఆలీ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం.. రామకృష్ణ. నిర్మాత.. రవికుమార్.
About Writer
PNR