1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మాగ్జిమ్ కోసం ''బికినీలో'' హాట్ హాట్‌గా ''శ్రియ''

మాగ్జిమ్ కోసం బికినీ హాట్ హాట్‌ శ్రియ
WD PhotoWD
'ఇష్టం' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన శ్రియ ప్రారంభంలో సాంప్రదాయబద్ధంగా, పక్కింటి అమ్మాయిలా నటించింది. ఆ తర్వాత సైతం కొన్ని చిత్రాలవరకు శ్రియ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా నటించింది. అయితే కొన్ని చిత్రాల తర్వాత శ్రియ కొద్దికొద్దిగా ఎక్స్‌ఫోజింగ్ చేయడం ప్రారంభించింది. అలా హీరోయిన్‌గా ఆఫర్ల సంఖ్య పెరుగిన కొద్దీ శ్రియ ధరించే దుస్తులు సైజు తగ్గిపోతూ వచ్చింది.

ఇలాంటి తరుణంలో శ్రియ తమిళ చిత్రపరిశ్రమలో సైతం అడుగుపెట్టింది. అక్కడ ఓ రెండు చిత్రాల్లో నటించిన తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన 'శివాజీ' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో తన అంగాంగా ప్రదర్శనతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన శ్రియ ఆ తర్వాత తమిళంలో నటించిన చిత్రాల్లో అదే తరహాలో ఎక్స్‌పోజింగ్‌కు పెద్దపీట వేసింది.

దీంతో శ్రియకు బాలీవుడ్‌తో సహా హాలీవుడ్‌లోను ఛాన్స్‌లు వచ్చిపడ్డాయి. అప్పటివరకు దక్షిణాదికి మాత్రమే శ్రియ బాలీవుడ్ వాసులకూ దగ్గరైంది. దాంతో బాలీవుడ్‌ హీరోయిన్ల తరహాలోనే కొనసాగాలని నిర్ణయించుకున్న శ్రియ మరింత ఘాటైన ఎక్స్‌పోజింగ్‌కు సిద్ధమైంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే శ్రియ తాజాగా మాగ్జిమ్ పత్రికలో బికీనీతో ప్రత్యక్షమై అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

మాగ్జిమ్ పత్రిక కోసం శ్రియ బికినీలో ఇచ్చిన ఫోజులు చూచిన వారు ఇక శ్రియ చిత్రాల్లో సైతం బికినీతో కనిపించే రోజులు మరెంతో దూరంలో లేవని అనుకుంటున్నారట. ఆ పత్రికకు శ్రియ ఇచ్చిన ఫోజులు చూచినవారు బాలీవుడ్, హాలీవుడ్ అలవాట్లు శ్రియకు అప్పుడే ఒంటబట్టేశాయని కూడా అనుకుంటున్నారట.
About Writer
Munibabu