1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నేను స్త్రీవాదిని కాదు: అయేషా టకియా

బాలీవుడ్ చిత్ర పరిశ్రలో తన కెరీర్‌ను కొనసాగించేందుకు తాను ఎంచుకుంటున్న పాత్రలు
FileFILE
బాలీవుడ్ చిత్ర పరిశ్రలో తన కెరీర్‌ను కొనసాగించేందుకు తాను ఎంచుకుంటున్న పాత్రలు పూర్తి సంతృప్తినిస్తున్నాయని హిందీ నటి అయేషా టకియా స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో పురుషుల ఆధిపత్యం కొనసాగడం తనకు ఎలాంటి నష్టం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఎందుకంటే తాను స్త్రీవాదిని కాదని అందువల్ల పురుషాధిక్య చిత్ర పరిశ్రమం వల్ల తనకొచ్చిన సమస్యలేవీ లేవన్నారు. బ్యాంకాగ్‌లో జరుగుతున్న ఐఐఎఫ్‌ఏ చిత్రాల్లో ఆమె పాల్గొని త్వరలో విడుదల కానున్న 'దే తాలి' అనే చిత్రాన్ని ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా అయేషా టకియా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రల ఎంపిక అనేది నటీనటుల వ్యక్తిగతంపై ఆధారపడి వుంటుందన్నారు. తన వరకు పరిశీలిస్తే తాను చేసే ప్రతి క్యారెక్టర్ సంతృప్తినిస్తోందన్నారు. తన తదుపరి కొత్త చిత్రం 'ఫ్రెండ్‌షిఫ్‌'పై స్పందిస్తూ.. 'ఫ్రెండ్‌షిఫ్' అనేది యువతీ యువకులు లేదా ఇద్దరి జీవితాలకు ఎంతో ముఖ్యమైనదన్నారు.

అలాగే.. 'దీ తాలి' చిత్ర కథ పూర్తిగా ముగ్గురు స్నేహితుల మధ్య సాగుతుంది. రితేష్ దేశ్‌ముఖ్, తాను, అఫ్తాప్ శివ్‌దాసానిల మధ్య నడుస్తుంది. అయితే చిత్రంలో వచ్చే రిమ్మీసేన్ పాత్ర వాళ్ళ స్నేహాన్ని చిన్నాభిన్నం చేస్తుందని అయేషా వివరించారు.
About Writer
PNR