1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పోలీసులను గౌరవించాలని చెప్పే ''ఏక్ పోలీస్''

పోలీసుల గౌరవించాల ఏక్ పోలీస్
WD PhotoWD
నాగేంద్రబాబు హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఎక్ పోలీస్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్.హెచ్.రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.హెచ్. భాస్కరరెడ్డి, ఎం.వి.కృష్ణప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను అమీర్‌పేటలోని జెనెటిక్ కాలేజీ అవరణలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాత్రకు నాగబాబు వన్నె తెచ్చారన్నారు. పోలీసులను గౌరవించాలి అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. నిజాయితీ గల పోలీస్ ఎలాంటి పోరాటం చేస్తాడు. దానికి కారణాలేమిటి అనేది ఈ చిత్ర ఇతివృత్తం అని ఆయన తెలిపారు. ఈ చిత్రం ద్వారా విలన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

నాగబాబు మాట్లాడుతూ యంగ్ స్టార్స్‌తో కలిసి నటిస్తున్నానని తెలిపారు. వారికి, తనకు ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం చిత్రంలో చూడాలని ఆయన అన్నారు. ఈ చిత్రంలో ఓ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా తాను నటిస్తున్నానని నాగబాబు తెలిపారు. నిర్మాత భాస్కరరెడ్డి మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జూన్ 18 నుంచి జూలై 10 వరకు జరిగే షూటింగ్‌తో పూర్తి చేస్తామన్నారు. పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్‌సామ్రాట్, సుర్యచరణ్, దీరజ్, సత్యప్రకాష్, డా. శివప్రసాద్, అశోక్‌కుమార్, కోటి, రవి ఆచార్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథా సహాకారం- వల్లభనేని జనార్థన్, మాటలు- స్వామీజీ, విజయ్, పాటలు- సాహితీ, వనమాలి, రామజోగయ్య శాస్త్రి, సంగీతం- కోటి.
About Writer
Munibabu