90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ''ఒక్కటవుదాం''
ప్రముఖ మోడల్ కౌషాల్ హీరోగా హంస నందిని హీరోయిన్‌గా నిర్మితమవుతున్న చిత్రం 'ఒక్కటవుదాం'. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం మేరకు పూర్తయింది. మురళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బి.అమర్, ఆర్.శ్రీను, ఆర్.సంగీతలు నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
నాలుగు పాటలు మినహా చిత్ర షూటింగ్ పూర్తయిందని, ఆ నాలుగు పాటలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని దర్శకుడు మురళీకృష్ణ చెప్పారు. ఈ పాటలను అరకు, విశాఖపట్నం తదితర అందమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నట్టు చెప్పారు.
ఈ చిత్రంలో రిషి ప్రత్యేక పాత్రను పోషిస్తుండగా, ప్రియాంక ఆయన సరసన నటిస్తున్నట్టు తెలిపారు. సంగీత దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు వచ్చిన ఒక సాధారణ యువకుడు, తనకు ఎదురైన కష్టాలను పరిష్కరించుకుని, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే ఈ చిత్ర కథ అని నిర్మాతలు చెప్పారు.