''యోగా టీచర్'' డైరీలో ఖాళీలేని పేజీలు
|
ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవితేజ హీరోగా నటించనున్న చిత్రంలో కూడా అనుష్క ఎంపికైంది. ఈ చిత్రానికి 'బలాదూర్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అయితే ఇవన్నీ అనుష్క అందాలకు గుర్తింపుగా వస్తున్న ఆఫర్లుగా భావించవచ్చు. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే కాకుండా మంచి పాత్రల్లో నటిస్తోంది.
వీటితో పాటు 'అరుంధతి' వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా అనుష్క తన నటనను ప్రదర్శిస్తోంది. ఇలా ప్రతి బ్యానర్‌లో నటించేందుకు ఎంపికవుతున్న అనుష్క.. తన రోజువారీ షెడ్యూల్‌ను రాసుకునేందుకు కూడా తన వ్యక్తిగత డైరీలో పేజీలు ఖాళీలు లేక ఇబ్బందులు పడుతున్నారట.