1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నగరజీవనంలో ఎఫ్ఎం నగారా

నగరజీవనంలో ఎఫ్ఎం నగారా
FileFILE
గుడ్‌మార్నంగ్..... హైదరాబాద్. ఈ మాటలు వినిపించగానే మనకు గుర్తు వచ్చేది ఎఫ్ఎం రేడియో... శంకర్ దాదా జిందాబాద్‌ సినిమాతో పాపులర్ అయిన ఈ కేక రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది.గుడ్‌మార్నంగ్..... తిరుపతి, గుడ్‌మార్నంగ్..... విజయవాడ. గుడ్‌మార్నంగ్..... విశాఖపట్నం. ఇదీ వరస. ఎఫ్ఎం నగర జీనంలో భాగమై పోయింది.

టీవీలు, ఇంటర్నట్లు ప్రపంచాన్ని చుట్టుముట్టిన తరుణంలో ఇక రేడియోకు కాలం చెల్లిందనే అందరూ అనుకున్నారు. ప్రపంచీకరణ పుణ్యమాని ప్రైవేటు ఎఫ్ఎం రేడియోలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. కాలేజీ కుర్రాళ్ళ నుంచి గృహిణుల వరకు అందరిలోనూ ఈ రేడియోకు మంచి ఆదరణ ఉంది. 30 నుంచి 50 డయా కి.మీ. పరిధిలో పని చేసే ఇవి నగరవాసులను ఊరిస్తున్నాయి.

ఆటోవాలాల నుంచి ఆధునిక కారు డ్రైవర్ల వరకు ఎఫ్ఎం వినియోగంలో మునిగి తేలుతున్నారు. కుర్రజాకీలు ఎఫ్ఎం శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. చలాకీ చలాకీ మాటలతో వారిని బాగానే ఆకట్టుకుంటున్నారు. పాతనాటి కర్ణాటక సంగీతాలను ఈ రేడియోలు పక్కన పెట్టాయి. నేటి కుర్రకారు నాడెరిగిన కార్యక్రమాలతో ఎఫ్ఎంలు ముందుకు వస్తున్నాయి.

సెల్ ఫోన్‌లోనే ఎఫ్ఎం సౌకర్యం ఉండడంతో వీటికి శ్రోతల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ప్రత్యేకించి యూనివర్శిటీల్లో విద్యార్థులకు ఎఫ్ఎం వినోద వస్తువుగా మారిపోయింది. సమయం చిక్కినప్పుడల్లా జాకీలతో మాట్లాడుతూ కోరిన పాటలను వింటూ విద్యార్థులు కాలం గడిపేస్తుంటారు.

మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాలు వారికి ఉల్లానిస్తున్నాయి. వంటింట్లో కూడా ఈజీగా ఇమిడి పోయే రేడియో మార్కెట్ లోకి వచ్చేశాయి. ఒక వంటిల్లేమిటి, ఆటో, కారు ఇలా ప్రతి వాహనంలోనూ ఎఫ్ఎంలు కొలువుదీరుతున్నాయి. తన రూపురేఖలను మార్చుకుని జనం ముందుకు వచ్చిన రేడియో మనోరంజకంగానే ఉంది.
About Writer
పుత్తా యర్రం రెడ్డి