రబ్బరు గాజుల సవ్వడికి ''జాతీయ అవార్డు''
|
తమిళ చిత్రం 'పరుత్తివీరన్'లో ఆమె ప్రదర్శించిన నటనకు గాను ఈ అవార్డు వచ్చింది. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ తనకు దక్కిన విజయం దర్శకునికే చెందుతుందన్నారు. ఈ అవార్డు రావడానికి కారణమై దర్శకుడు అమిర్‌కు జన్మజన్మల వరకు రుణపడి ఉంటానని చెప్పారు.
ఆయన కోరుకున్న విధంగా నేను నటించాను అని ప్రియమణి చెప్పారు. ముత్తళగు అనే పేరుతో గ్రామీణ యువతిగా నటించిన ప్రియమణి నటనకు పలు ప్రశంసలు వచ్చిన విషయం తెల్సిందే. దర్శకుడు ఏమి చెప్పారో దాన్ని నేను కెమరా ముందు ప్రదర్శించాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక చిత్రం షూటింగ్ కోసం బెంగుళూరులో ఉంటున్న ప్రియమణి అవార్డుపై పై విధంగా స్పందించారు.
అంతేకాకుండా ఈ అవార్డును తాను గురువులుగా భావిస్తున్న భారతిరాజా, బాలు మహేంద్ర, అలాగే కార్తీ శివకుమార్‌లకు రుణపడి ఉన్నట్టు చెప్పారు. 'పరుత్తివీరన్' చిత్రంలో కార్తీ శివకురమార్ చెప్పారు. 'కన్గలాల్ కైదు సెయ్' అనే చిత్రం ద్వారా దర్శకుడు భారతిరాజా నటి ప్రియమణిని వెండితెరకు పరిచయం చేశారు.
ఆ తర్వాత బాలుమహేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'అదు ఒరు కనాక్కాలం' చిత్రంలో ప్రియమణికి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం జాతీయ అవార్డు మత్తులో మునిగి పోయినవున్న రబ్బరు గాజుల చిన్నదానికి గత ఏడాది తమిళంలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు.