ఛార్మి ప్రధాన పాత్రలో ''16 డేస్'' షూటింగ్ పూర్తి
|
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ 16 రోజుల్లో జరిగే సంఘటనల నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రంలో ఛార్మిపై చిత్రీకరించిన ఇంట్రడక్షన్ సాంగ్ హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రంలో ఇతరపాత్రల్లో కోటశ్రీనివాసరావు, జయప్రకాష్, ధర్మవరపు సుబ్రమణ్యం, మనోరమ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు- నివాస్, పాటలు- సుకుమార్, భాస్కరభట్ల, సంగీతం- ధరన్.