''పులిహోర'' వడ్డించడానికి జగపతిబాబు రెడీ
|
అలాంటి జగపతిబాబు ప్రస్తుతం జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు 'హోమం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబుకు జోడీగా మమతా మోహన్‌దాస్ నటిస్తోంది. ఇది కాక రజినీకాంత్ హీరోగా వస్తోన్న 'కుచేలుడు' చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాలతో పాటు జగపతిబాబు మరో కొత్త చిత్రం చేయడానికి అంగీకరించారని సమాచారం. గతంలో 'ఒక ఊరిలో' చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్‌వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కొత్త చిత్రం ఉండబోతోంది. ఈ చిత్రానికి 'పులిహోర' అనే టైటిల్‌ను పెట్టనున్నారు. 'రెండున్నర గంటల తాలింపు' అనేది ట్యాగ్‌లైన్. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.