1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జూన్ 25 నుంచి మార్కెట్‌లో ''కుచేలుడు'' సంగీతం

జూన్ 25 మార్కెట్‌ కుచేలుడు సంగీతం
FileWD
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుచేలుడు'. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రం ఆడియోను జూన్ 25న మార్కెట్‌లోకి తేవడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఓ సినిమా హీరోగా కుచేలుడు చిత్రంలో రజినీకాంత్ నటిస్తుండగా జగపతిబాబు బార్బర్ పాత్రలో నటిస్తున్నాడు. కథ ప్రకారం వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ప్రస్తుతం 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న జి.వి. ప్రకాష్‌కుమార్ ఎ.ఆర్. రెహ్మాన్ బంధువు కావడం విశేషం. నయనతార, మమతామోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిసున్న ఈ చిత్రం జూలై రెండోవారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
About Writer
Munibabu