తన అన్నగారింట్లో పిల్లలు యానిమేషన్ చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సత్యం సైతం దాన్ని చూడడం మొదలు పెట్టారు. అలా యానిమేషన్ చిత్రంలో లీనమైపోయిన సత్యం తనే ఓ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. అలా సత్యనారాయణ ఊహల నుంచి జాలు వారిన యానిమేషన్ చిత్రమే 'కిట్టు'.
ఆయన అలా రూపొందించిన చిత్రమే 2006 ఉత్తమ యానిమేషన్ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. యానిమేషన్ పరిశ్రమపై కలిగిన ఆసక్తితో సత్యనారాయణ టోనీయార్క్‌లో పనిచేయడం ప్రారంభించారు. దాదాపు ఆరు యానిమేషన్ చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీలోకి రాగా తన చిత్రం కిట్టు-2డి యానిమేషన్ చిత్రం అవార్డుకు ఎంపిక కావడం ఆనందానిస్తోందని ఆయన పేర్కొంటున్నారు.
జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా సత్యనారాయణ తన భావాలను మనతో పంచుకున్నారు. అలా ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
సహజంగా పౌరాణికాలు యానిమేషన్‌గా రూపొందుతుంటాయి. కానీ పిల్లలు మెచ్చే కథలతో యానిమేషన్ చిత్రం తీయాలనే సంకల్పంతో ఈ కథ ఎంచుకోవడం జరిగింది. ఆ సమయంలో భార్గవ సంస్థతో ఏర్పడిన పరిచయంతో వారే నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.