''మహాయజ్ఞం''కు డీటీఎస్ కార్యక్రమాలు
|
అమ్మతనాన్ని పక్కనపెట్టి మరో ఆడదానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి ఓ తల్లి చేసిందే ఈ మహాయజ్ఞం అని ఆయన అన్నారు. తాను ఇప్పటివరకు ఉదర పోషనార్థం ఎనిమిది చిత్రాలను చేశానని అన్నారు. అయితే తన తొమ్మిదో చిత్రంగా చేస్తున్న ఈ మహాయజ్ఞం చిత్రం చేయడం పట్ల తాను గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రవీందర్ గుప్త మాట్లాడుతూ మంచి కథ, కథనంతో తొలిసారి చిత్రరంగ ప్రవేశం చేశామని అన్నారు. ఈ చిత్రంలో సుద్ధాల సంచలన పాత్ర చేశారని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అలాగే త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
చిత్ర హీరో కృష్ణమారుతి మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. రంగా రవీందర్ గుప్త, సంధ్యా రవీందర్ గుప్త సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో భానుప్రియ, చంద్రమోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా- సురేందర్‌రెడ్డి, మాటలు- దాసం వెంకట్రావ్, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్.