జూన్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు ''శుభం''
నాగబాబు ప్రధాన పాత్రలో వికాస్, సంగీత కపూర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'శుభం ది గుడ్ బిగినింగ్'. మోహనశృతి క్రియేషన్స్ పతాకంపై జి. శివప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.ఆర్. మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ వర్క్ జరుపుకుంటోంది.
మరో రెండు రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇదని అన్నారు. ఆసక్తికరమైన మలుపులతో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. ఆడియో సాధించిన విజయాన్ని పురష్కరించుకుని త్వరలోనే ప్లాటినం డిస్క్ కార్యక్రమం జరపనున్నట్టు ఆయన తెలిపారు. నాగేంద్రబాబు ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో వికాస్, సంగీతకపూర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, ఆహుతీ ప్రసాద్, కవిత, ఉత్తేజ్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, మాధురీసేన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ- మోహనశృతి క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే, మాటలు- రవి కొలికపూడి, పాటలు- భాస్కరభట్ల రవికుమార్, ఫైట్స్- నందు, డాన్స్- రాజ్‌గురు, ఎడిటింగ్- బులిరెడ్డి, సంగీతం, నిర్మాత- సి.ఆర్. మోహన్, దర్శకత్వం- జి. శివప్రసాద్‌రెడ్డి.