రీ-రికార్డింగ్ కార్యక్రమాల్లో ''దీపావళి''
వేణు, మేఘానాయర్ జంటగా హరిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దీపావళి'. ఈ చిత్రంలో భానుచందర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, వినోద్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ దీపావళి సందర్భంగా జరిగే ఓ సంఘటనతో ఈ చిత్రం కథ ముడిపడి ఉంటుందన్నారు. ఈ చిత్రంలో వచ్చే ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
చిత్ర హీరో వేణు మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ జూన్ మూడో వారంలో చిత్రం ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే జూలై ద్వితియార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సుబ్బరాజు, సత్యప్రకాష్, బ్రహ్మాజీ, అలీ, బ్రహ్మానందం, కొండవలస, చలపతిరావు, సుధ, హేమ తదితరులు నటిస్తున్నారు.