1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

షూటింగ్ పూర్తి చేసుకున్న ''4 కపుల్స్''

షూటింగ్ పూర్తి చేసుకు 4 కపుల్స్
సూర్యవంశీ, మధుమిత జంటగా వంశీరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '4 కపుల్స్'. ఇండియన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తాండూరు జనార్థనరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ చిత్రం ఆడియోను జూన్ చివరన విడుదల చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందుకు తేవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

తమ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో రామిరెడ్డి, అభినయశ్రీ, కళ్లు చిదంబరం, జెన్నీ, కేకే శర్మ, శిల్పారెడ్డి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా- సుధాకర్ నాయుడు, ఎడిటింగ్- శ్రీను, సంగీతం- అర్జున్.
About Writer
Munibabu