1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాట పాడుకుంటున్న ''పున్నమినాగు''

పాట పాడుకుంటున్న పున్నమినాగు
FileWD
ముమైత్‌ఖాన్ ప్రధానపాత్రలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పున్నమినాగు'. సౌండ్ అండ్ క్లాప్ సంస్థ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోగా రాజీవ్‌కనకాల నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పాట చిత్రీకరణ జరపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ చిత్రంలో భావోద్వేగాలకు పెద్దపీట వేశామన్నారు. యండమూరి వీరేంద్రనాధ్ రచన ఈ చిత్రం కథకు ఆధారమని ఆయన తెలిపారు.

దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన పున్నమినాగు చిత్రం తరహాలోనే ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ఎమ్మెస్ నారాయణ, సాజిత్‌ఖాన్ నటిస్తున్నారు. ఎస్.ఏ. రాజ్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
About Writer
Munibabu