1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రాహుల్ హీరోగా తుదిమెరుగుల్లో ''రెయిన్‌బో''

రాహుల్ హీరో తుదిమెరుగు రెయిన్‌బో
WD PhotoWD
హ్యాపీడేస్ ఫేం రాహుల్ హీరోగా నటిస్తున్న 'రెయిన్‌బో' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. వి.ఎన్. ఆదిత్య స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, సింధూ మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన ఆదిత్య మాట్లాడుతూ ఓ వైవిధ్యమైన ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. ప్రేమికుల మధ్య ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని ఈ చిత్రంలో చూపడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు.

నేపథ్యగాయకుడు నిహాల్ తొలిసారిగా ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని సమకూర్చారని ఆయన చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పంధన వస్తోందన్నారు. సంగీతం ఈ చిత్రానికి పెద్ద సపోర్ట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు.

తమ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ చివరికల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
About Writer
Munibabu