డీటీఎస్ కార్యక్రమాల్లో ''మా ఆయన చంటిపిల్లాడు''
|
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ ఓ అమాయకుడైన వ్యక్తి అనుకోకుండా ఓ స్త్రీ వ్యామోహంలో చిక్కుకుంటే అతని భార్య ఎలా స్పందించింది అన్న పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు.
శివాజీ భార్యగా మీరాజాస్మిన్ పాత్ర చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందన్నారు. సంగీత పాత్ర సైతం చాలా వైవిధ్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తుండగా భాస్కరభట్ల ఈ చిత్రానికి అన్ని పాటలు అందించడం విశేషం.