1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''బెనజీర్‌''గా ''ఐశ్వర్య'': యూటీవీ ప్రయత్నాలు ?

బెనజీర్ ఐశ్వర్య యూటీవీ ప్రయత్నాలు
FileWD
మాజీ ప్రపంచ సుందరిగా, నటిగా విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ ఖాతాలో మరో ఖ్యాతి వచ్చి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టోపై తీసే చిత్రంలో ఐశ్వర్య నటించే అవకాశాలు ఉన్నట్టుగా బాలీవుడ్ వర్గాల కథనం.

యూటీవి నిర్మించే ఈ చిత్రంలో బెనజీర్ పాత్రను పోషించడానికి ఐశ్వర్యను సంప్రదిస్తున్నారట. అలాగే ఈ చిత్రానికి కథను సిద్ధం చేసే బాధ్యతను యూటీవీ సంస్థ నీలేష్ మిశ్రాను సంప్రదించింది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, అనుమతి కోసం యూటీవీ ప్రతినిథులు బెనజీర్ కుటుంబాన్ని కూడా సంప్రదించనున్నారట.

వీటితోపాటు ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన అనుమతి కోసం నిర్మాతలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని సైతం సంప్రదిస్తున్నారట. ఇవన్నీ జరిగితే బెనజీర్‌గా ఐశ్వర్య తెరపై కనిపించనున్నారు. ఈ విషయమై కథా రచయిత నీలేష్ మిశ్రా మాట్లాడుతూ బెనజీర్ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధం చేయమంటూ యూటీవీ సంస్థ తనను సంప్రదించిందని తెలిపారు.

అయితే తాను ఇంకా ఈ చిత్ర రచనకు పూనుకోలేదని ఆయన తెలిపారు. బెనజీర్ పాత్ర చేయడానికి ఐష్ ఒప్పుకుంటే మిగతా విషయాలు వేగంగా ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు.
About Writer
Munibabu