''హీరో''గా రావడానికి సిద్ధమవుతున్న నితిన్
|
ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. విలన్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న జీవీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానుండడం విశేషం. ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ నితిన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం కథ ఉంటుందని పేర్కొన్నారు.
ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భావనకు ఈ చిత్రం రెండోది. ప్రస్తుతం నితిన్ సిక్స్ ఫ్యాక్ బాడీతో నటించిన 'విక్టరీ' చిత్రం విడుదల కావాల్సిఉంది.