ఉత్తరాంధ్రలో ''పోకిరి''ని మించిన ''పరుగు'': దిల్‌రాజు
|
ఈ సందర్భంగా శనివారం దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరుగు చిత్రం 75 ఏళ్ల సినీ రికార్డులను బ్రద్ధలు కొట్టిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పరుగు చిత్రం కలెక్షన్ల పరంగా పోకిరి చిత్రాన్ని అధిగమించిందని ఆయన అన్నారు.
అందుకే వైజాగ్‌లో జూన్ 19న పరుగు అర్థ శతదినోత్సవం వేడుకలు జరపనున్నామని తెలిపారు. పరుగు చిత్రం హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆర్య తర్వాత మంచి కథతో ఈ చిత్రం చేయడం జరిగిందని తెలిపారు. చిత్రం మొదటివారం కలెక్షన్ పరంగా తగ్గినా ఆ తర్వాత పుంజుకుందని అన్నారు.
ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు తాను కృతజ్ఞతలు చెబుతున్నట్టు అల్లు అర్జున్ తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్రానికి మంచి ఊపునిచ్చిన ప్రకాష్‌రాజ్‌కు తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అర్జున్ పేర్కొన్నారు.