భాగ్యనగరిలో బచ్చన్ ఫ్యామిలీ
Publish: Mon, 16 Jun 2008 (20:40 IST)
Updated: Mon, 16 Jun 2008 (20:23 IST)
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం భాగ్యనగరికి వచ్చారు. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్‌లు కలసి ఇటీవల నటించిన 'సర్కార్ రాజ్' చిత్రం విడుదలైన విషయం తెలస్సిందే. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు గాను అమితాబ్ కుటుంబ సభ్యులు ఆదివారం హైదారాబాద్‌కు వచ్చారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో సహా ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా భాగ్యనగరికి విచ్చేశారు. స్థానికి పివిఆర్ సినిమా థియేటర్‌లో జరిగిన చిత్ర ప్రమోట్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బచ్చన్ కుటుంబం రాక సందర్భంగా సినిమా థియేటర్ సమీపంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను కూడా దూరంగా ఉంచారు.