తెలుగు వెండితెరకు మరో ''వారసుడు''
|
నాగ చైనన్య హీరోగా పరిచయం చేసే చిత్రాన్ని ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడుని పరిచయం చేయబోతున్నారు. తొలుత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని నాగ చైతన్య తాత, ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు సొంత బ్యానర్‌లో నిర్మిస్తారని భావించారు.
అయితే ఆ బాధ్యతను అక్కినేని కుటుంబానికే రామానాయుడు వదిలేశారు. ఇదిలావుండగా డిగ్రీ పూర్తి చేసిన చైతన్య.. ప్రస్తుతం ముంబైలోని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. కాగా, ఈ చిత్రం పూర్తి వివరాలు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది తదితర సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంది.