కొన్నేళ్లుగా ప్రేక్షకులను పక్కదారి పట్టిస్తున్నారు: అమితాబ్
|
సినిమా అంటే కేవలం పాటలు, డ్యాన్స్‌లు అనే భావన ప్రేక్షకుల్లో నెలకొనేలా చేశారన్నారు. వాస్తవికత, చిత్తశుద్ధితో చూసే సినిమాలు చేయాలి. ప్రేక్షకులు అలాంటి వాటిని తప్పుకుండా ఆదరిస్తారు. భవిష్యత్‌లో ఎవరైనా ముందుకు వస్తే ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు 'బిగ్ బి' ప్రకటించారు.
ఆ తర్వాత అభిషేక్ మాట్లాడుతూ నేను ప్రతి రోజు తల్లిదండ్రులతోనే గడుపుతాను. నాకు ప్రతి రోజు తల్లిదండ్రుల దినోత్సవమే. ఆదివారం నాడు 'ఫాదర్స్ డే' సందర్భంగా అడిగిన ప్రశ్నకు అభి పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొని తన చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. అలాగే.. తెలుగు భాషలో స్ట్రైట్ చిత్రాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అందాల నటి ఐశ్వర్యా రాయ్ ప్రకటించారు.