1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

18న అద్వానీ ఆవిష్కరించనున్న ''శ్రీరామ మందిర్''

తెలుగులో విజయవంతమైన 'శ్రీరామదాసు' చిత్రాన్ని
FileFILE
తెలుగులో విజయవంతమైన 'శ్రీరామదాసు' చిత్రాన్ని హిందీలో 'శ్రీరామ మందిర్' పేరుతో అనువాదం చేశారు. ఈ చిత్రం ఆడియోను భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఈనెల 18వ తేదీన ఆవిష్కరించనున్నారు. 'శ్రీరామదాసు' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఆరు భాషల్లోకి అనువాదం చేస్తున్న విషయం తెల్సిందే.

దీనిపై నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ.. 'శ్రీరామ మందిర్' ఆడియోను ఈనెల 18వ తేదీన ఢిల్లీలోని శ్రీఫోర్ట్‌లో అద్వానీ విడుదల చేస్తారని చెప్పారు. పలువురు రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, ఆ రోజే చిత్ర ప్రివ్యూను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. తాను నిర్మించిన చిత్రం ఆడియోను ఒక గొప్ప రాజకీయనాయకుడు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

వచ్చే జులైలో విడుదలకు నోచుకోనున్న ఈ చిత్రం భోజ్‌పురి, గుజరాతీ, మలయాళం, తమిళ భాషల్లోకి అనువాదం చేసినట్టు చెప్పారు. ఈ ఆరు భాషల్లో చిత్రానికి వచ్చే స్పందన చూశాక, మరో 16 భాషల్లోకి అనువదించేందుకు కృషి చేస్తామన్నారు. తమిళంలో 'రామాలయం' పేరుతో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఈ చిత్రం ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
About Writer
PNR