ప్రజాక్షేమం కోసం మెగాస్టార్ ప్రత్యేక పూజలు
|
కానీ ఆయన బావమరిది అల్లు అరవింద్, సోదరుడు నాగబాబులు మాత్రం చిరు రాజకీయ పయనంపై వార్తలు గుప్పిస్తున్నారు. వచ్చే ఆగస్టులో మెగాస్టార్ రైలు బండి ఫ్లాట్‌ఫామ్‌పైకి వచ్చేస్తోందని ప్రకటించారు. దీంతో ఆ రైలు బండిని ఎక్కేందుకు పలు రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు ఫ్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని దేవాలయానికి కుటుంబ సమేతంగా మెగాస్టార్ విచ్చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. దైవదర్శనం కోసం చిరంజీవి ఆలయానికి వచ్చారనే వార్త రాజధాని మీడియాలో గుప్పుమంది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న మీడియా చిరంజీవిపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆయన ఏమాత్రం తొందర పడకుండా ప్రశాంతవదనంతో మీడియాకు సమాధానం ఇచ్చారు. ఆలయ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అభిషేకానికి ఆహ్వానించారని చెప్పారు. ఆంజనేయుడు తన ఇష్టదైవమని ఆయన్ను దర్శనం చేసుకొని, ప్రజాక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు మెగాస్టార్ చెప్పారు. రాజకీయాల గురించి ప్రత్యేక చర్చించుకుందామని చిరునవ్వుతో సమాధానం ఇస్తూనే అక్కడ నుంచి నిష్క్రమించారు.