వెండితెరపై ''వీరప్పన్''కు జీవం
|
తాజాగా వెండితెరపై వీరప్పన్‌కు జీవం పోయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ రామ్‌గోపాల్ వర్మ ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం వీరప్పన్ భార్య ముత్తులక్ష్మితో వర్మ చర్చలు జరిపినట్టు ఫిల్మ్‌మేకర్‌కు చెందిన అత్యంత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
వర్మ దర్శకత్వం వహించి తాజాగా విడుదలైన 'సర్కార్ రాజ్' చిత్రానికి కథ రాసిన ప్రశాంత్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందులో పూర్తిగా కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న 'కాంట్రాక్ట్', 'ఫూంక్' చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ బిజీగా ఉన్నారు.