1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రేమతో చెప్పండి : నాగబాబు

ప్రేమతో చెప్పండి నాగబాబు ఉపాధ్యాయులు విద్యార్థులు నేటి సమాజం  చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు
WD PhotoWD
ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని, నేటి సమాజంలో పూజించదగ్గ వ్యక్తి గురువేనని చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి మెగా ఉపాధ్యాయ సంస్థ సమావేశానికి నాగేంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా పెట్టుకోవటంలో తన గొప్పతనం ఏమీలేదని, అలా పెట్టుకోవడం ఉపాధ్యాయ సంఘ నాయకుల సంస్కారానికి నిదర్శనమని అన్నారు.

విద్యార్థులకు ప్రేమతో చెబితే ఏ విషయమైనా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు. ఉపాధ్యాయ సంఘం ఏర్పాటుకు వి.బ్రహ్మారెడ్డి మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని, ఆయన చెప్పిన వ్యక్తిత్వ వికాస తరగతులు తమ ఫ్యాన్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

అంతకుముందు చిరంజీవి కోర్‌కమిటీ సభ్యులు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రతి వ్యక్తికీ ముగ్గురు గురువులు ఉంటారని, ఒకరు తల్లి అయితే, రెండో స్థానం ఉపాధ్యాయుడిదని, మూడో గురువు ప్రకృతి అని పేర్కొన్నారు.

ఈ మూడు లేకుండా ఒక వ్యక్తి సంపూర్ణంగా రూపుదాల్చడం కష్టతరమని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి మానవ సంబంధాలు, భావప్రకటనలో స్పష్టత ఏర్పరచుకోవాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డికి ఉచిత కరెంటు ఇవ్వాలని సలహా ఇచ్చింది... తామేనని బ్రహ్మారెడ్డి చెప్పారు. చంద్రబాబుకు జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని సూచన ఇచ్చిందీ తామేనని చెప్పారు.
About Writer
Selvi