1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

యండమూరి కథతో ముమైత్ "పున్నమినాగు"

యండమూరి కథతో ముమైత్
WD PhotoWD
ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "పున్నమినాగు". జి.విజయ్‌కుమార్ గౌడ్ నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం తొలిషెడ్యూల్ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలిపింది. జూలై ఒకటో తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఆగస్టులో జరిగే చివరి షెడ్యూల్తో చిత్రం పూర్తవుతుందని నిర్మాత చెప్పారు.

ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్లో రెండు ఫైట్స్‌తో పాటు సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని ఆయన అన్నారు. ముమైత్‌పై ఓ పాటను చిత్రీకరించామని, యాక్షన్ నేపథ్యంలో సెంటిమెంట్‌ను టచ్‌చేస్తూ హాస్యాన్ని మిళితం చేసి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ఆయన వివరాలందించారు.

కోదండరామిరెడ్డి అందరికీ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ... యండమూరి వీరేంద్రనాథ్ చక్కని కథ ఇచ్చారని, మాస్‌కు కావాల్సిన అన్నీ అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు. ఇంకా ఓర్నీ, లోచన్, వినోద్ కుమార్, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా... పి.ఎస్.బాబు, స్ర్కీన్‌ప్లే... స్వామీజీ, సంగీతం... ఎస్.ఎ. రాజ్‌కుమార్, సమర్పణ... జి.మహేశ్వర రెడ్డి.
About Writer
Selvi