ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీకాంత్, ఛార్మీ జంటగా "కౌసల్య సుప్రజ రామ"  Search similar articles
WD
శ్రీకాంత్, ఛార్మీ, గౌరిముంజల్ హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రానికి "కౌసల్య సుప్రజ రామ" అనే పేరు ఖరారైంది. "నీకే మనసిచ్చాను" దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి డా. డి. రామానాయుడు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నానక్‌రామ్‌గూడా సినీవిలేజ్‌లో జరుగుతుంది.

ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడుతూ... ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని, జూలై 6వరకు షెడ్యూల్ జరుగుతుందని అన్నారు. జూలై 22న విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతామని, తిరిగి వచ్చాక క్లైమాక్స్‌ను హైదరబాద్‌లో చిత్రీకరించనున్నట్లు ఆయన వివరాలందించారు.

కుటుంబ కథా నేపథ్యంలో, మానవతవిలువలతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు రామానాయుడు చెప్పారు. ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్స్‌లో తను చేస్తున్న నాలుగో సినిమా ఇదని, మూడు సినిమాలు హిట్టయ్యాయని, ఇది కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.

నలుగురికి ఉపయోగపడే మనస్తత్వంగల పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఛార్మీ మాట్లాడుతూ... ఎప్పటి నుంచో నాయుడుగారి సినిమాలో చేయాలనే ఆలోచన ఉండేదవి, అది ఈనాటికి నెరవేరిందని చెప్పారు. దర్శకుడు కథ చెప్పిన విధానం ఎంతగానో నచ్చిందని, కామెడీ ట్రాక్ కొత్తగా ఉందని, ఇందులో సుప్రజగా నటిస్తున్నానని, ఈ పేరు తనకెంతో ఇష్టమని అన్నారు. ప్రస్తుతం ఉగాది పాటను చిత్రీకరించే పనులు జరుగుతున్నాయని, ఈ చిత్రం హిట్ కావాలని నిర్మాత, దర్శకులు ఆకాంక్షిస్తున్నారని ఛార్మీ వెల్లడించారు.

దర్శకుడు మాట్లాడుతూ... రామానాయుడు గారి నుంచి తనకీ అవకాశం వచ్చిందని అన్నారు. శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతంలోని మొదటి పేర్లను తీసుకుని టైటిల్‌గా పెట్టారని, అంత ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు ఎల్.బి.శ్రీరామ్ అన్నారు. శివారెడ్డి మాట్లాడుతూ... కోటశ్రీనివాసరావు కొడుకుగా నటిస్తున్నానని, నా పాత్ర ఇందులో వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ధర్మవరపు, భరణి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, సైరభాను, హేమ, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని
రవితేజ, పూరీ కాంబినేషన్లో "నేనింతే"
యండమూరి కథతో ముమైత్ "పున్నమినాగు"
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా "కాల్‌సెంటర్"
శ్రీహరి, సుమన్ అన్నదమ్ములుగా "సామ్రాజ్యం"
కలెక్షన్ల వెల్లువలో "సోంబేరి"
ప్రేమతో చెప్పండి : నాగబాబు