పిల్లల మనస్తత్వాలను "అర్థం చేసుకోరూ"
|
ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... త్వరలో తొలికాపీ సిద్ధం కానుందని, సెన్సార్ కూడా పూర్తిచేసి వచ్చేనెల ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇక టైటిల్ గురించి వివరించాలంటే... పిల్లలు, పెద్దల మధ్య అంతరాయాలు ఎలా ఉన్నాయి? దాన్ని పిల్లలే ఏవిధంగా సరిచేశారు? అనే అంశాలతో చిత్రం రూపొందిందని అన్నారు. వారి ప్రేమను అర్థం చేసుకుని వారి మనస్తత్వాలను గౌరవించాలనే సందేశం కూడా ఇందులో చూపించబోతున్నామని చెప్పారు.
నిర్మాత కిన్నెర మాట్లాడుతూ... జీవితం విలువైందని, ఏదైనా సాధిస్తేనే దానికి సార్థకత ఉంటుందని, అప్పుడే ప్రేమకూడా వారిని వెతుక్కుంటూ వస్తుందనే అంశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారని తెలిపారు. త్వరలో చిత్రాన్ని విడుదలచేయనున్నట్లు తెలిపారు. తేజస్విని కథానాయికగా నటిస్తుండగా రాజీవ్ కనకాల విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా మురళీ మోహన్, వైజాగ్ ప్రసాద్, కవిత, హేమ, బేబి త్రిష తదితరులు నటిస్తున్నారు.