ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హీరోయిన్లపై హీరో రాజశేఖర్ ఆరోపణలు  Search similar articles
FileFILE
ఇటీవలి కాలంలో హీరో రాజశేఖర్ రాష్ట్ర మీడియా దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు. కారణం.. ఆయన వ్యవహారశైలి మాత్రమే కాదు.. చేసే వ్యాఖ్యలు కూడా సంచలనాత్మకంగానే ఉంటున్నాయి. తమ ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆరోపించిన రాజశేఖర్ దంపతులు ప్రభుత్వ రక్షణ కోరారు. తాజాగా... చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనతో నటించేందుకు నిరాకరిస్తున్నారని, అలాగే తాను చేయదలచుకున్న కొత్త చిత్రాల స్క్రిప్ట్‌ను కూడా కాల్చి వేస్తున్నారని ఆరోపించారు.

కాగితాలను మాత్రమే కాల్చగలరు. తన మనస్సులో ముద్రితమైన అచ్చును ఎవరూ కాల్చలేరు కదా? అని ప్రశ్నించారు. రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'సత్యమేవ జయతే'. ఈ చిత్రం షూటింగ్ శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ 'ఖాకీ' అనే హిందీ చిత్ర కథతో 'సత్యమేవ జయతే'ను నిర్మిస్తున్నాం. కథలో చాలా మార్పులు చేశాం. చాలా రోజుల పాటు శ్రమించి స్క్రిప్ట్‌ను ఒక కొలిక్కి తెచ్చాం.

తీరా ఆ స్క్రిప్ట్‌ను ఎవరో కాల్చి వేశారు. అయినా నా మనస్సులో ముద్రితమైన దాన్ని కాల్చలేరు కదా. అందుకే ఎన్ని చేసినా ఎవరూ నన్ను ఆపలేరు. తన కొత్త చిత్రం ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా చేయాలని భావించాను. అందుకే ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాను. సహజంగా ఆయన సినిమా ఫంక్షన్లకు రారు. అయితే పిలిచిన వెంటనే నా చిత్ర ప్రారంభోత్సవానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకనాటి 'అంకుశం' చిత్రంలా ఈ చిత్రం ఉంటుంది.

ఈ చిత్రంలో మిలింద్ సోమన్, అతుల్ కులకర్ణి, షిండే, హీరోయిన్లుగా నీతూచంద్ర, సంజన, షరిల్ పింటోలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొత్త హీరోయిన్లను ఎంపిక చేయడంలోనూ ఓ కారణం ఉంది. పరిశ్రమకు చెందిన కొందరు హీరోయిన్లు నాతో నటించేందుకు నిరాకరిస్తున్నారు. అందుకే ఏం చేయాలి..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
మరిన్ని
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెస్సార్...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజశేఖర్ చిత్రం
ఎలాంటి పాత్రకైనా సై
పిల్లల మనస్తత్వాలను "అర్థం చేసుకోరూ"
శ్రీకాంత్, ఛార్మీ జంటగా "కౌసల్య సుప్రజ రామ"
రవితేజ, పూరీ కాంబినేషన్లో "నేనింతే"