ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జీర గొంతు హాస్యం... మూగబోయింది  Search similar articles
లుకేమియా వ్యాధితో శాశ్వత నిద్రలోకి జారుకున్న మల్లిఖార్జున రావు ఆరంభంలో నాటకాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించేవారు. అలా ప్రారంభమైన ఆయన కెరీర్ ... కీర్తి శేషులు రావుగోపాలరావు గుర్తించడంతో అనుకోని మలుపు తిరిగింది. అంతే... ఆయన సూచన, ప్రోద్భలంతో 1973లో 'తులసి' అనే చిత్రంలో చిన్న పాత్రను పోషించారు మల్లిఖార్జున్.

అలా మల్లిఖార్జున్ తెలుగు వెండితెర ప్రవేశం జరిగింది. అప్పట్లో ఆయన నటించిన 'నాగమల్లి', 'ఆలాపన' చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టలేక పోయాయి. ఆ తర్వాత ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన 'చందమామ రావోయి' అనే చిత్రంలో నూతన ప్రసాద్ మామగా నటించారు. అయినప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఆ సమయంలో సినీ రంగానికి స్వస్తి పలికి నాటకరంగంపైనే దృష్టి సారించాలనే ఆలోచన ఆయనకు తట్టింది.

ఈ పరిస్థితుల్లో 1983లో వంశీ దర్శకత్వంలో నటించే అవకాశం మరోసారి మల్లిఖార్జున్ తలుపు తట్టింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన 'లేడీస్ టైలర్' చిత్రంలో బట్టతల సత్యం పాత్రను పోషించారు. ఈ పాత్ర ఆయన జీవిత గమ్యాన్నే మార్చేసింది. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరును సైతం తోసిరాజని ప్రతిఒక్కరు 'బట్టతల సత్యం'గా మల్లిఖార్జునను పిలవడం ప్రారంభించారు.

కేవలం ఒకే ఒక పాత్రతో వెండితెరపై నిలదొక్కున్న మల్లిఖార్జున రావు అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. 'జంబలకిడి పంబ' చిత్రంలో సరికొత్త పాత్రలో తన నట స్వరూపాన్ని ప్రదర్శించారు. 1999లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నాడు.

జీర గొంతుతో హాస్యాన్ని రంగరించి వెండితెరపై ఎన్నో హాస్య గుళికలను అందించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన 'బట్టతల సత్యం' గొంతు మూగబోయింది. జూన్ 24వ తేదీ మంగళవారం ఆయనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
మరిన్ని
వైఎస్ చేతుల మీదుగా 'సత్యమేవ జయతే' ప్రారంభం
హీరోయిన్లపై హీరో రాజశేఖర్ ఆరోపణలు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెస్సార్...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజశేఖర్ చిత్రం
ఎలాంటి పాత్రకైనా సై
పిల్లల మనస్తత్వాలను "అర్థం చేసుకోరూ"