ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దసరా కానుకగా జయంత్ "చెడుగుడు"  Search similar articles
చెడుగుడు
WD PhotoWD
సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి "చెడుగుడు" అనే పేరు ఖరారైంది. స్మైల్ మూవీస్ పతాకంపై హాస్యనటి కోవైసరళ సమర్పణలో భీమినేని తిరుపతయ్య (రాయుడు), కె. నాగిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి. ఆర్ నాగరాజు దర్శకత్వ సారథ్యం వహిస్తున్నారు.

చెన్నైకి చెందిన శ్వేత నాయికగా పరిచయం అవుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... 20 ఏళ్ళ తర్వాత వెంకట్రాజపురం అనే గ్రామంలో మళ్ళీ "చెడుగుడు" మొదలైంది? ఎవరు మొదలు పెట్టారు? ఎందుకు? దీనికి దారితీసిన కారణాలేమిటి? అనే అంశాలతో పూర్తిస్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. అయితే ఇది "ఆట" నేపథ్యంలో సాగే కథ మాత్రం కాదని స్పష్టం చేశారు.

హీరోగా నటిస్తున్న జయంత్ విజువల్ కమ్యూనికేషన్స్ డిగ్రీ పూర్తి చేశారని, నటనకు సంబంధించిన నృత్యాలతోనూ, జిమ్నాస్టిక్, కరాటేలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారని వివరించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు మనుమడే హీరోగా పరిచయమవుతున్నారని ఆయన అన్నారు.

కథనాయిక శ్వేత చెన్నైలో బి.టెక్ మూడో సంవత్సరం చదువుతోందని ఆయన చెప్పారు. ఇటీవలే కోనసీమలో బ్రహ్మానందం, కోవైసరళల మీద ముహూర్తపు సన్నివేశ చిత్రీకరణతో చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 24నుంచి 50 రోజుల పాటు పాలకొల్లు, రాజమండ్రి, వైజాగ్, అరకు, హైదరాబాద్‌లలో జరిగే షూటింగ్‌తో నిర్మాణం పూర్తవుతుందని, దసరా కానుకగా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా నరేష్, సుమన్ శెట్టి, అలీ, ఎం.ఎస్, సునీల్, నాగబాబు, షిండే, భరత్ నల్లవేణు, ప్రగతి, దేవీశ్రీ, ఆశాషైనీ తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని
జీర గొంతు హాస్యం... మూగబోయింది
వైఎస్ చేతుల మీదుగా 'సత్యమేవ జయతే' ప్రారంభం
హీరోయిన్లపై హీరో రాజశేఖర్ ఆరోపణలు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెస్సార్...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజశేఖర్ చిత్రం
ఎలాంటి పాత్రకైనా సై