ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శరవేగంగా "మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు"  Search similar articles
మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు
WD PhotoWD
రఘుబాబు, శివాజీరాజా, మధువన్ హీరోలుగా మంజునాథ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ.కె. రమణ దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న "మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు" చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సారథి స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని నిర్మాత అన్నారు.

ఈ నెల 26వరకు జరిగే షెడ్యూల్తో 40 శాతం చిత్రం పూర్తవుతుందని, జూలైలో మరో 25 రోజుల షూటింగ్‌తో టాకీ పూర్తవుతుందని ఆయన అన్నారు. హాంకాంగ్‌లో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపిన ఆయన, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరానాడు విడుదల చేస్తామని వెల్లడించారు.

దర్శకుడు మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో ఉండే సమస్యనే తీసుకుని వినోదాత్మకంగా చూపిస్తూ భార్యాభర్తలు ఎలా వుండాలో అనే విషయాన్ని చక్కగా సందేశంతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. వీరేష్‌గారు అందించిన డైలాగ్స్ కథకు ప్రాణం పోశాయని చెప్పారు. రఘుబాబు మాట్లాడుతూ... మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనలు ఎంతో కామెడీగా ఉంటూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తాయని చెప్పారు.

హీరో మధువన్ మాట్లాడుతూ... కథ, కథనాలతో రూపొందుతోన్న చిత్రాన్ని నిర్మాత కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారని అన్నారు. హీరోయిన్లుగా శీతల్, రాఖీలు నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, జీవా, బాబు మోహన్, బాబిలోనియా తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని
దసరా కానుకగా జయంత్ "చెడుగుడు"
జీర గొంతు హాస్యం... మూగబోయింది
వైఎస్ చేతుల మీదుగా 'సత్యమేవ జయతే' ప్రారంభం
హీరోయిన్లపై హీరో రాజశేఖర్ ఆరోపణలు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెస్సార్...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాజశేఖర్ చిత్రం