''అ...'' అంటే అసిన్ అంటున్న బాలీవుడ్
|
ఇదిలా వుంటే ప్రముఖ ఫ్యాషన్ మేగజైన్ వోగ్ ముఖపత్రంపైకి ఆమె ఫోటో ఎక్కింది. ఈ సందర్భంగా పత్రిక ఎడిటర్ మాట్లాడుతూ... ఎవరైతే భారతీయ చలనచిత్ర రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంటారో వారిని తాము ప్రమోట్ చేయటం జరుగుతూ వుంటుందనీ, ఈ క్రమంలో అసిన్ ఫోటో జూలై సంచిక ముఖ చిత్రంగా ప్రచురించామని చెప్పారు. అసిన్‌కు మంచి టాలెంట్ వుందనీ, అందువల్లే అమీర్ సరసన నటించే అవకాశం కొట్టేసిందని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇకనుంచి బాలీవుడ్‌లో అసిన్ హవా సాగుతుందన్నమాట.