1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పులికోసం తలకోనకు వెళ్తున్న పవన్‌కళ్యాణ్

తలకోన పులి పవన్‌కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వం
WD PhotoWD
'పులి'కోసం పవన్‌కళ్యాణ్ తలకోన అడవులకు వెళ్తున్నారు. అసలు విషయమేమిటంటే... ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న చిత్రం "పులి". ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే దిల్‌సుఖ్‌నగర్‌లోని విక్టోరియా స్కూల్లో నాలుగు రోజుల షూటింగ్ జరిగింది.

కొన్ని యాక్షన్ సన్నివేశాలను 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య చిత్రించారు. శుక్రవారం నుంచి యాక్షన్‌తో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం పవన్ తలకోనకు ప్రయాణమవుతున్నారు. ఎనిమిది రోజుల షూటింగ్ అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది.

యాక్షన్ సన్నివేశాలను విజయ్ నేతృత్వంలో చిత్రిస్తున్నారు. కనకరత్నం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.
About Writer
Selvi