చక్కని కుటుంబ కథా నేపథ్యంలో "అడుగు"
తండ్రీ కొడుకుల మధ్య సాగే కథాంశంతో "అడుగు" చిత్రం రూపొందుతోంది. సుమరేంద్ర, సుమన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రీచాసోని హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బొమ్మకంటి మాధవి నిర్మిస్తున్న ఈ సినిమాకు వీరప్రసాద్ నీలం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, వచ్చేనెల ద్వితీయార్థంలో షూటింగ్ ముగించి, ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బొమ్మకంటి మాధవి అన్నారు.
"అడుగు" గురించి సుమన్ వివరిస్తూ... తండ్రీ కొడుకుల మధ్య సాగే కథా నేపథ్యంలో, వారి మధ్య జరిగే కొన్ని అపార్థాలు, అనుమానాలు ఏవిధంగా తారాస్థాయికి చేరుతాయి. అందుకు గల కారణాలను అన్వేషించి కొడుకు వాటిని ఎలా పరిష్కరించాడు అనే పాయింట్‌తో రూపుదిద్దుకుంటోందని చెప్పారు. మరోవైపు హీరోహీరోయిన్ల ప్రేమాయణం కొత్తతరహాలో దర్శకుడు ప్రెంజెంట్ చేస్తున్నాడని, చెన్నైలో వున్న తనకు ఈ కథ చెబితే నచ్చి ఒప్పుకున్నానని అన్నారు.
"అనసూయ" చిత్రానికి పనిచేసిన ఎన్. సుధాకర్ రెడ్డి కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే చక్కని కుటుంబకథా చిత్రమిదవుతుందని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు వీరప్రసాద్ మాట్లాడుతూ... తన కుటుంబం బాగుకోసం కొడుకుగా వేసిన మొట్టమొదటి అడుగే ఈ చిత్ర కథని, కథకు తగిన విధంగా టైటిల్ పెట్టామని, తనపై నమ్మకముంచిన నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు అన్నారు.
తాను టీవీరంగంలో ఉన్నా పాత్ర నచ్చితేనే సినిమాల్లో నటిస్తున్నానని, ఎక్కువగా మాట్లాడే తాను ఇందులో మాటలు తక్కువగా ఉంటాయనీ, దర్శకుడు తీర్చిదిద్దిన ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని నటి ఝాన్సీ అన్నారు. "గమ్యం" తర్వాత మరో వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నానని రావు రమేష్ వెల్లడించారు.
సీనియర్ నటుల సరసన నటించడంవల్ల ఎంతో నేర్చుకుంటున్నానని కథానాయకుడు సమరేంద్ర చెప్పారు. తెలుగులో తొలిసారిగా నటిస్తున్నానని హీరోయిన్ రీచాసోని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో ధర్మవరపు, బెనర్జీ, అలీ, ఎం.ఎస్, భరత్, సుధ, సూర్య, శ్రావణ్, అనంత్ తదితరులు నటిస్తున్నారు.